Redmi A2 Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ.. తన ఏ2 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్ లో ఆవిష్కరించడానికి సిద్ధమైంది. ట్విట్టర్ వేదికగా ఈ సంగతి వెల్లడించింది. ఈ నెల 19న మార్కెట్లోకి రెడ్ మీ ఏ2, రెడ్ మీ ఏ2+ ఫోన్లు తీసుకురానున్నది. రెండు ఫోన్లు కూడా 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఒక్టాకోర్ ప్రాసెసర్ కలిగి ఉన్నాయి. గత మార్చిలో రెడ్ మీ ఎ2 సిరీస్ ఫోన్లు.. వనీలా రెడ్ మీ ఏ2, రెడ్ మీ ఏ2 + ఫోన్లు గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్లు 6.52 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, మీడియా టెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉన్నాయి. 8-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటాయి.
ఈ నెల 19 ఉదయం 11 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని రెడ్ మీ ట్వీట్ చేసింది. రెడ్ మీ ఏ2, రెడ్ మీ ఏ2 + వేరియంట్ పోన్లు ఎంట్రీ లెవల్ ఆఫర్లతో మార్కె్ట్లోకి వస్తాయని భావిస్తున్నారు. వెబ్ సైట్ లో ఆసక్తిగల కస్టమర్లు ‘నోటిఫై మీ` బటన్ నొక్కితే ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పొందొచ్చు.
యూరప్ మార్కెట్లో గత మార్చిలో ఆవిష్కరించిన రెడ్ మీ ఏ2, రెడ్ మీ ఏ2+ ఫోన్లు ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) వర్షన్ పై పని చేస్తాయి. 6.52-అంగుళాల హెచ్డీ+ (1600 x 720 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ విత్ 20:9 యాస్పెక్ట్ నిష్పత్తితో వస్తున్నది. సెల్ఫీ షూటర్లకు స్క్రీన్ మీద వాటర్ డ్రాప్ -స్టైల్ నాచ్ సెటప్ ఉంటుంది. మీడియా టెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్ సెట్ విత్ అప్ టూ 3జీబీ ఎల్పీడీడీఆర్4 ఎక్స్, 32 జీబీ ఈఎంఎంసీ 5.1 ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటాయి.
8-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్ విత్ క్యూవీజీఏ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో చాట్ ల కోసం 5-మెగా పిక్సెల్స్ సెల్ఫీ సెన్సర్ ఉంటది. రెడ్ మీ ఏ2 సిరీస్ ఫోన్లు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలు విత్ 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. రెడ్ మీ ఏ2+ ఫోన్ బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా కలిగి ఉంటుంది.