Market Pulse | స్టాక్ మార్కెట్లలో రికార్డ్ రన్.. ఈ వారం ఆటుపోట్లకు ఆస్కారం!
దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డ్ రన్ కొనసాగుతున్నది. మునుపెన్నడూలేని గరిష్ఠాల్లో సూచీలు కదలాడుతున్నాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల దిశగానే పోతున్నారు. గత వారం ట్రేడింగ్‌లో ఎక్కువ రోజులు ఈక్విటీ మార్కెట్లు లాభాల్లోనే నడిచాయి.
Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డ్ రన్ కొనసాగుతున్నది. మునుపెన్నడూలేని గరిష్ఠాల్లో సూచీలు కదలాడుతున్నాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల దిశగానే పోతున్నారు. గత వారం ట్రేడింగ్‌లో ఎక్కువ రోజులు ఈక్విటీ మార్కెట్లు లాభాల్లోనే నడిచాయి. ఈ క్రమంలోనే వారం మొత్తంగా సూచీలు భారీగానే ఎగిశాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,027.54 పాయింట్లు లేదా 1.21 శాతం పెరిగి 85,571.85 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 388 పాయింట్లు లేదా 1.50 శాతం పుంజుకొని 26,178.95 దగ్గర ముగిసింది. ఈ నేపథ్యంలో లాభాల స్వీకరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
శుక్రవారం మార్కెట్లు నష్టపోవడం ఇందుకు సంకేతంగా తీసుకోవచ్చని మెజారిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఆల్‌టైమ్ హై దరిదాపుల్లో ఉండటం వల్ల సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 25,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 25,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 26,400-26,600 మధ్యకు వెళ్లవచ్చు.
చివరగా..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

