Realme V60 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ వీ60 ప్రో ఫోన్ ను శుక్రవారం చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. మూడు రంగుల్లో వస్తున్న రియల్మీ వీ60 ప్రో ఫోన్ 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది. త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నది.
రియల్మీ వీ60 ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.18,600 (1599 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.21 వేలు (1799 చైనా యువాన్లు) పలుకుతుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో పని చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 2 టిగా బైట్ల వరకూ పొడిగించుకోవచ్చు. డైనమిక్ ర్యామ్ ఎక్స్ పాన్షన్ ఫీచర్ ద్వారా ర్యామ్ 24 జీబీ వరకూ పెంచుకోవచ్చు. లక్కీ రెడ్, రాక్ బ్లాక్, ఒబ్సిడియన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. రియల్మీ వీ60 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ తోపాటు సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.