న్యూఢిల్లీ : భారత్‌లో అత్యంత చవకైన మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్మీ నార్జో 60x 5జీని (Realme Narzo 60x 5G) రియల్మీ లాంఛ్ చేసింది. లేటెస్ట్ నార్జో సిరీస్‌లో మూడో ఫొన్గా రియల్మీ నార్జో 60x 5జీ కస్టమర్ల ముందుకొచ్చింది. స్లిమ్ డిజైన్‌తో 6.72 ఇంచ్ డిస్ప్లేతో రెండు స్టోరేజ్ వేరియంట్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకోనుంది. రియల్మీ నార్జో 60x 5జీ 4జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 12,999కి అందుబాటులో ఉంటుంది.
6జీబీ ర్యాం వేరియంట్ రియల్మీ 11X కంటే రూ. 500 తక్కువగా రూ. 14,499కి లభిస్తోంది. లేటెస్ట్ రియల్మీ ఫోన్ స్టెల్లార్ గ్రీన్, నెబ్యులా పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 15 మధ్యాహ్నం నుంచి ఫస్ట్ సేల్ షురూ కానుంది. ఆరంభ సేల్‌లో భాగంగా యూజర్లు రూ. 1000 ఆఫర్‌ను పొందే అవకాశం కల్పించారు. రియల్మీ నార్జో 60xతో పాటు రియల్మీ బడ్స్ టీ300 యాక్టివ్ క్యాన్సిలేషన్ ట్రూవైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంఛ్ చేసింది.
వైట్, బ్లాక్ షేడ్స్లోలభించే ఈ ఇయర్ బడ్స్ రూ. 2299కి అందుబాటులో ఉంటాయి. ఇక రియల్మీ నార్జో 60x నార్జో 60, నార్జో 60 ప్రొ డిజైన్‌ను పోలిఉంది. వెనుకభాగంలో అదేతరహాలో రౌండ్ మాడ్యూల్ కెమెరాను అమర్చగా, పోర్ట్రయిట్ లెన్స్‌తో 50ఎంపీ ప్రైమరీ సెన్సర్, 2ఎంపీ సెకండరీ సెన్సర్ ఆకట్టుకుంటుంది. రియల్మీ నార్జో మీడియాటెక్ డైమెన్షిటీ 6100+ ఎస్ఓసీ ప్రాసెసరతో పాటు 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
Read More :
Poco C51 | 6జీబీ ర్యామ్‌తో పొకో సీ51.. ఇవీ డిటైల్స్..!