Poco C51 | 6జీబీ ర్యామ్‌తో పొకో సీ51.. ఇవీ డిటైల్స్..!
Poco C51 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో.. భారత్ మార్కెట్లోకి మరో వేరియంట్ పొకో సీ51 ఫోన్ తీసుకొచ్చింది. రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Poco C51 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో తన పొకో సీ51 ఫోన్ (Poco C51) న్యూ వేరియంట్ ఫోన్ ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో గత ఏప్రిల్ నెలలో 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్.. భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
తాజాగా పొకో సీ51 (Poco C51) .. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఆసక్తి గల వారు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది
పొకో సీ51 (Poco C51) 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.6,499లకే లభిస్తుండగా, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.8,999లకు అందుబాటులో ఉంది. సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు.
పొకో సీ51 (Poco C51) ఫోన్ 6.52 అంగుళాల హెచ్డీ + (1600×720 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. 400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ వస్తోంది పొకో సీ51 (Poco C51). అయితే, 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, సెకండరీ డెప్త్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. సెక్యూరిటీ కోసం బ్యాక్ ప్యానెల్‌పై ఫింగర్ ప్రింటర్ సెన్సర్ ఉంటుంది. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూ టూత్, జీపీఎస్, గ్లోనాస్, బైదూ, మైక్రో – యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

