Realme C53 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ రియల్మీ.. భారత్ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ రియల్మీ సీ53 ఆవిష్కరించింది. న్యూ రియల్మీ సీ-సిరీస్ ఫోన్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ యూనిట్ ఉంటుంది. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లే విత్ 90 హెర్ట్జ్తో వచ్చింది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది.
రియల్మీ సీ53 ఫోన్ 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.9999, 6జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,999లకు లభిస్తుంది. చాంపియన్ గోల్డెన్, చాంపియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ నెల 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్మీ డాట్ కామ్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం అవుతాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.
రియల్ మీ సీ53 ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్ మీ యూఐ టీ ఎడిషన్ వర్షన్ మీద పని చేస్తుంది. ఈ ఫోన్ 6.74 -అంగుళాల డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 90.3 స్క్రీన్ టు బాడీ రేషియో, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. యునిసోక్ టీ612 ప్రాసెసర్ కూడా జత చేశారు.
108-మెగా పిక్సెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్డ్ ప్రైమరీ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో 108-మెగా పిక్సెల్ సెన్సర్ గల తొలి స్మార్ట్ ఫోన్ ఇది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఈ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 2టిగా బైట్స్ వరకు స్టోరేజీ సామర్థ్యం పెంచుకోవచ్చు.
రియల్ మీ సీ53 ఫోన్ 4జీ, జీపీఎస్ / ఏజీపీఎస్, వై-ఫై, బ్లూటూత్ 5, 3.5 హెడ్ ఫోన్ చాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తుంది. యాక్సెలో మీటర్, మ్యాగ్నటిక్ సెన్సర్, లైట్ సెన్సర్, గైరో మీటర్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ లు ఉంటాయి.