Realme | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ 13 ప్రో+ (Realme 13 Pro+), రియల్మీ 13 ప్రో (Realme 13 Pro) ఫోన్లను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్మీ 13 ప్రో ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేతో వస్తోంది. రియల్మీ 13 ప్రో+ ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 701 ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, రియల్మీ 13 ప్రో ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. రెండు ఫోన్లలోనూ 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటాయి.
రియల్మీ 13 ప్రో+ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.34,999, టాప్ ఎండ్ మోడల్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.36,999లకు లభిస్తాయి. ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.
రియల్మీ 13 ప్రో ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.28,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999లకు లభిస్తాయి. ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ పర్పుల్, మోనెట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.
రియల్మీ తన రియల్మీ 13 ప్రో ఫోన్ పై మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఎర్లీ బర్డ్ సేల్ ప్రకటించింది. రియల్ మీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎర్లీ బర్డ్ సేల్ నిర్వహిస్తారు. రెండు ఫోన్ల ప్రీ బుకింగ్స్ జూలై 31 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతాయి. ఆగస్టు ఆరో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫస్ట్ సేల్ మొదలవుతుంది.
సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై లాంచ్ ఆఫర్ల కింద రూ.3000 వరకూ ఇన్ స్టంట్ డిస్కౌంట్, 12 నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఆఫర్ చేస్తోంది రియల్మీ. రియల్మీ 13 ప్రో సిరీస్ ఫోన్లపై ఏడాది వారంటీ పొడిగిస్తున్నట్లు తెలిపింది.
రియల్మీ 13 ప్రో+ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5.0 వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2412 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. 4ఎన్ఎం క్వాల్ కామ్ ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటాయి.
రియల్మీ తన రియల్మీ 13 ప్రో+ ఫోన్ లో 50-మెగా పిక్సెల్ 1/ 1.56 అంగుళాల సోనీ ఎల్వైటీ 701 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కమెరా కూడా ఉంటుంది. ఏఐ ఆడియో జూమ్ వంటి ఏఐ బేస్డ్ ఫీచర్లతో కూడిన కెమెరా సెటప్ ఉంటది. వై-ఫై6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఎక్స్-యాక్సిస్ లినియర్ మోటార్ ఫర్ గేమింగ్, హెచ్-రెస్ ఆడియో మద్దతుతో డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. 80వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తోంది.
రియల్మీ 13 ప్రో ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంాయి. నైన్ లేయర్ కూలింగ్ సిస్టమ్ విత్ 4500 స్క్వేర్ ఎంఎం టెంపర్డ్ వాపర్ చాంపర్, 9953 స్క్వేర్ ఎంఎం గ్రాఫిటీ ఎరియా ఉంటాయి.
50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 1/1.95- అంగుళాల సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32- మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 45వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తోంది.