Realme 13 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ 13 5జీ (Realme 13 5G) సిరీస్ ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ సిరీస్‌లో రియల్ మీ 13 5జీ (Realme 13 5G), రియల్ మీ 13+ 5జీ (Realme 13+ 5G) ఉన్నాయి. ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఉంటుంది.
ఈ నెల 29 మధ్యాహ్నం 12 గంటలకు రియల్ మీ 13 5జీ (Realme 13 5G) సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తామని మంగళవారం తెలిపింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. రెండు ఫోన్లూ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. సర్క్యులర్ సేప్డ్ కెమెరా సెటప్ ఉంటుంది. రియల్మీ డాట్ కామ్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఫోన్లు లభిస్తాయి.
రియల్మీ 13 5జీ (Realme 13 5G) ఫోన్లు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ 5 వర్షన్‌పై పని చేస్తాయి. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ తో వస్తోంది. 6జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్ ఆప్షన్లతోపాటు 128 జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోరేజీ, ఒక టిగా బైట్ స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తాయి. 50 -మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
రియల్మీ 13 5జీ (Realme 13 5G) ఫోన్ 6.72 అంగుళాల ఎల్టీపీఎస్ స్క్రీన్ విత్ ఫుల్ హెచ్డీ+ రిజొల్యూషన్ తో వస్తుందని తెలుస్తోంది. 6జీబీ / 8 జీబీ/ 12 జీబీ/ 16 జీబీ ర్యామ్, 128 జీబీ/ 256 జీబీ/ 512 జీబీ/ ఒక టిగా బైట్ స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం. 4880 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని చెబుతున్నారు.