Realme | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్ మీ 13 5జీ (Realme 13 5G), రియల్మీ 13+ 5జీ (Realme 13+ 5G) ఫోన్లను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ వర్షన్ పై పని చేస్తుంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో రెండు ఫోన్లు వస్తున్నాయి. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ లభిస్తాయి. గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభిస్తారు. సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి ఫోన్ల డెలివరీ మొదలవుతుంది. రియల్ మీ ఇండియా వెబ్ సైట్, రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేసిన వారికి ఆరు నెలల వరకూ ఫ్రీ స్క్రీన్ డ్యామేజీ ప్రొటెక్షన్ ఆఫర్ ఉంటుంది.
రియల్మీ 13 5జీ (Realme 13 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999లకు లభిస్తాయి. రియల్మీ 13+ 5జీ (Realme 13+ 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.22,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999 పలుకుతాయి. ప్రధాన రిటైల్ స్టోర్ల ద్వారా ప్రీ ఆర్డర్ బుక్ చేసుకునే వారికి రూ.1299 విలువైన రియల్ మీ వైర్ లెస్ 3 నియో నెక్ బ్యాండ్, ప్రీ ఆర్డర్ చేసుకున్న వారికి రూ.1500 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
రియల్ మీ 13 5జీ సిరీస్ ఫోన్ల ఫస్ట్ సేల్ సెప్టెంబర్ ఆరో తేదీన మొదలవుతుంది. ప్రీ ఆర్డర్ల ద్వారా బుక్ చేసుకున్న వారికి రూ.1500 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. రియల్ మీ 13 5జీ ఫోన్ డార్క్ పర్పుల్, స్పీడ్ గ్రీన్ కలర్.. రియల్ మీ 13+ 5జీ ఫోన్ విక్టరీ గోల్డ్ షేడ్ తోపాటు డార్క్ పర్పుల్, స్పీడ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.
రియల్మీ 13 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 240 టచ్ శాంప్లింగ్ రేటు, 580 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ లెవెల్తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ (1080×2400 పిక్సెల్స్) ‘ఐ కంఫర్ట్’ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మరోవైపు రియల్మీ 13+ 5జీ ఫోన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ లెవల్, 1200 హెర్ట్జ్ ఇన్సాంటేనియస్ శాంప్లింగ్ రేట్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) ఓలెడ్ ‘ఎస్పోర్ట్స్’ డిస్ ప్లే కలిగి ఉంటుంది. వర్షం కురుస్తున్నప్పుడైనా, తడి చేతులతోనైనా ఫోన్లు వాడేందుకు వీలుగా ఈ రెండు ఫోన్లలోనూ రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ఉంటుంది.
రియల్మీ 13 5జీ ఫోన్ 6ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్ సెట్, రియల్మీ 13+ 5జీ ఫోన్ 4ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ ప్రాసెసర్లతో వస్తుంది. రియల్మీ 13 5జీ ఫోన్లో ర్యామ్ వర్చువల్గా 8 జీబీ వరకూ రియల్మీ 13+ 5జీ ఫోన్లో వర్చువల్గా 14 జీబీ ర్యామ్ వరకూ పొడిగించవచ్చు.
రియల్మీ 13 5జీ సిరీస్ ఫోన్లు 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. రియల్మీ 13 5జీ ఫోన్ శాంసంగ్ ఎస్5కేఎన్ఎస్ మెయిన్ సెన్సర్, రియల్మీ 13+ 5జీ ఫోన్ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ సెన్సర్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లలోనూ మెయిన్ కెమెరాలకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతు ఉంటుంది. ఇంకా 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరాలతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 -మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు ఉంటాయి.
రియల్మీ 13 5జీ ఫోన్, రియల్మీ 13+ 5జీ ఫోన్లు 80వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. డ్యుయల్ 5జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. రియల్మీ 13 5జీ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, రియల్మీ 13+ 5జీ ఫోన్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటాయి.