Realme 12x 5G | ప్రముఖ చైనా టెక్నాలజీ సంస్థ రియల్మీ (Realme) మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రియల్మీ 12ఎక్స్ 5జీ (Realme 12x 5G) మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 పలుకుతుంది. 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ట్విలైట్ పర్పుల్, వుడ్ లాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
రియల్మీ 12ఎక్స్ 5జీ (Realme 12x 5G) ఎర్లీబడ్ సేల్స్ కింద మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకూ రియల్మీ ఇండియా వెబ్ సైట్, ప్రధాన ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ బుక్ చేసుకోవచ్చు. 4జీబీ ర్యామ్ వేరియంట్ రూ.10,999, 6జీబీ ర్యామ్ వేరియంట్ రూ.11,999, 8 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.13,999లకు లభిస్తాయి.
రియల్మీ 12ఎక్స్ 5జీ (Realme 12x 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్ రిజొల్యూషన్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8- మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5.0 వర్షన్ ఓఎస్ పై పని చేసే ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఉంటుంది. ఇంతకుముందు రియల్మీ 12 5జీ ఫోన్లో మాదిరిగా డైనమిక్ బటన్, ఎయిర్ గెస్చర్, మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్లు ఉంటాయి.
రియల్మీ 12ఎక్స్ 5జీ (Realme 12x 5G) ఫోన్ 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 645 గంటలు స్టాండ్ బై, 34.5 గంటలు ఫోన్ కాల్, 81.3 గంటలు మ్యూజిక్, 15.9 గంటలు బ్యాకప్ సపోర్ట్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్నది. డ్యుయల్ స్టీరియో స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కలిగి ఉంటది. 5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది.