ఎన్బీఎఫ్సీలపై ఆర్బీఐ కొరడా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 49 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. మరో 13 ఎన్బీఎఫ్సీలు, ఒక హెచ్ఎఫ్సీ తమ లైసెన్సులను సరెండర్ చేశాయి. దీంతో మొత్తం 63 ఆర్థిక సంస్థలపై ఆర్బీఐ నియంత్రణ చర్యలను తీసుకున్నైట్టెంది.
- 49 సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు
- మరో 14 కంపెనీలు సరెండర్
న్యూఢిల్లీ, నవంబర్ 16 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 49 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. మరో 13 ఎన్బీఎఫ్సీలు, ఒక హెచ్ఎఫ్సీ తమ లైసెన్సులను సరెండర్ చేశాయి. దీంతో మొత్తం 63 ఆర్థిక సంస్థలపై ఆర్బీఐ నియంత్రణ చర్యలను తీసుకున్నైట్టెంది. కాగా, ఆర్బీఐ చట్టం-1934లోని సెక్షన్ 45 ఐఏ(6) కింద 49 ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్టు సోమవారం రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే ఈ సంస్థలకు సంబంధించిన రద్దు ఉత్తర్వులు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 29 మధ్యే జారీ అయ్యాయి. అలాగే మరో ప్రకటనలో 13 ఎన్బీఎఫ్సీలు, ఒక హెచ్ఎఫ్సీ తమ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలను అప్పగించినట్టు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
ఆర్బీఐ చట్టం, జాతీయ గృహ బ్యాంక్ చట్టం-1987లోని సంబంధిత నిబంధనల కింద వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఇదిలావుంటే ఈ సంస్థల్లో 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వ్యాపారం నుంచి వైదొలగిన తర్వాత రిజిస్ట్రేషన్లు అప్పగించాయి. మరో ఐదింటిని నిర్దేశిత అర్హతలు పొందడంతో, RBI చట్టంలోని సెక్షన్ 45-ఐఏ ప్రకారం రిజిస్ట్రేషన్ అవసరం లేని నమోదు కాని టైప్-1 ఎన్బీఎఫ్సీలుగా వర్గీకరించారు. ఇంకో 3 సంస్థలు విలీనం, సమ్మేళనం, రద్దు లేదా స్వచ్ఛందంగా పేర్లు తొలగించుకోవడం వంటి కారణాలతో చట్టబద్ధ సంస్థలుగా ఉనికిని కోల్పోయాయి.
సరెండర్ చేసిన సంస్థల్లో..
రిజిస్ట్రేషన్లు అప్పగించిన సంస్థల్లో మణీష్ సింథెటిక్స్ ప్రైవేట్, అమర్ ప్లాజా అండ్ హోల్డింగ్స్ ప్రైవేట్, వికోనిక్ వ్యాపార్ ప్రైవేట్ లిమిటెడ్, రైట్ ట్రెజర్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ (ఇండియా) ప్రైవేట్, బ్రావో క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్, సీజీఆర్ మర్కంటైల్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఇక చట్టబద్ధ సంస్థలుగా ఉనికిని కోల్పోవడంతో రిజిస్ట్రేషన్లు రద్దయిన వాటిలో మణిభవనం హోమ్ ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సన్ సోర్స్ లీఫిన్ ప్రైవేట్ లిమిటెడ్, లైనర్ డిస్టిబ్య్రూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.రిజిస్ట్రేషన్లు రైద్దెన సంస్థలు.. ఆర్బీఐ చట్టం-1934లోని సెక్షన్ 45-ఐ క్లాజ్ (ఎ) ప్రకారం నిర్వచించిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వ్యాపారాన్ని ఇక నిర్వహించరాదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలు, వాటి రిజిస్ట్రేషన్ స్థితిపై ఆర్బీఐ పర్యవేక్షణలో భాగంగానే ఈ రెండు ప్రకటనలు వెలువడ్డాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

