అవాస్తవాలకు సమాధానం చెప్పేందుకే ..
తమ కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానం చెప్పేందుకే ఆత్మకథ రాసినట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలిపారు.
- ఆత్మకథపై సోనియాగాంధీ
న్యూఢిల్లీ: తమ కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానం చెప్పేందుకే ఆత్మకథ రాసినట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలో బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తన అత్త ఇందిర, భర్త రాజీవ్, పిల్లలు రాహుల్, ప్రియాంక, తన గురించి ఎన్నో అసత్య కథనాలు ప్రచారంలో ఉన్నాయని, వాటితో తమ కుటుంబ వాస్తవ జీవితానికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. తన భావాలను, కుటుంబం గురించి తనకు తెలిసిన విషయాలను ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాసినట్లు వివరించారు.
నవంబర్ 10న విడుదలైన ఈ పుస్తకం వారం రోజుల్లోపే రెండు లక్షలకు పైగా ప్రతులు అమ్ముడై, వేగంగా అమ్ముడైన తొలి రచనల్లో ఒకటిగా నిలిచింది. కొత్త ప్రదేశంలో పరాయివారిగా ఉండటం, ఇతరుల ఆమోదం పొందేందుకు ప్రయత్నించడం, చివరికి వారిలో ఒకరిగా మారడమే బిలాంగింగ్ పేరులోని భావమని సోనియా వివరించారు. పెండ్లయ్యాక అత్తవారింటికి వెళ్లే భారతీయ మహిళలు కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కష్టపడతారని అన్నారు.
తాను భిన్నమైన సామాజిక, సాంస్కృతిక నేపథ్యం నుంచి రావడంతో ఈ అనుభవం మరింత కష్టమైందని చెప్పారు. రాజీవ్ గాంధీతో తన పరిచయం కేంబ్రిడ్జిలో స్నేహితుడి ద్వారా జరిగిందని, తమది అద్భుతమైన ప్రేమకథ అని గుర్తుచేసుకున్నారు. వివాహం విఫలమైతే తిరిగి వచ్చేందుకు తన తండ్రి రిటర్న్ టికెట్ ఇచ్చారని, అయితే తాను తిరిగి వెళ్లలేదని సరదాగా చెప్పారు. ఈ కార్యక్రమానికి రాహుల్, ఖర్గే, పలువురు సీఎంలు హాజరయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

