‘విజ్ఞాన్స్’లో విశాట్ నోటిఫికేషన్ విడుదల
యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశోధనలకు పెద్దపీట వేయడంలాంటి సమున్నత లక్ష్యాలతో తాము ముందుకెళ్తున్నామని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేవీ కృష్ణకిశోర్ తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 16: (నమస్తే తెలంగాణ) : యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశోధనలకు పెద్దపీట వేయడంలాంటి సమున్నత లక్ష్యాలతో తాము ముందుకెళ్తున్నామని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేవీ కృష్ణకిశోర్ తెలిపారు. 2027-28 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ ఎల్ఎల్బీ(హానర్స్), బీబీఏ ఎల్ఎల్బీ(హానర్స్), బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్, ఫార్మ్ డీ అడ్మిషన్ల వీశాట్ నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీటెక్‌లో అగ్రికల్చర్, బయో టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయో మెడికల్, కెమికల్, సివిల్, సీఎస్ఈతోపాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, డాటా సైన్స్, ఐవోటీ, ఈసీఈ, ఈసీఈ-వీఎల్ఎస్ఐ, ఈఈఈ, ఫుడ్ టెక్నాలజీ, ఐటీ మెకానికల్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, టెక్స్టైల్ టెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫార్మా-డీ, ఎం ఫార్మసీ, బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్, డిప్లొమా(సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ) కోర్సులు అందజేస్తున్నామని తెలిపారు. వీటితోపాటు ఐటెప్ బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీఎస్సీ(సైకాలజీ), బీఎస్సీ(డాటా సైన్స్), బీఎస్సీ(మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్), బీఎస్సీ(ఆక్చూరియల్ సైన్స్), బీబీఏ, బీసీఏ, బీఏ(ఎల్ఎల్బీ), బీబీఏ (ఎల్ఎల్బీ), ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లిష్, ఎమ్మెస్సీ డాటా సైన్స్, ఎమ్మెస్సీ సైకాలజీ, పీహెచ్డీ కోర్సులు అందజేస్తున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

