ముంబై, ఆగస్టు 29: రెగ్యులేటరీ నిబంధనల్ని పాటించనందుకు హైదరాబాద్ కేంద్రం గా పనిచేస్తున్న దారుస్సలాం కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రిజర్వ్‌బ్యాంక్ రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ బ్యాంక్‌తో సహా దేశంలోని 8 సహకార బ్యాంక్‌లకు పెనాల్టీలు వేస్తున్నట్టు రిజర్వ్‌బ్యాంక్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ. 55 లక్షల జరిమానా వేయగా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ. 10 లక్షలు, నెల్లూరు కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ. 10 లక్షలు, కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్బ్యాంక్పై రూ.10 లక్షల చొప్పున ఫైన్ విధించింది. అదాయం గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, హౌసింగ్ స్కీమ్‌లకు ఫైనాన్స్, ప్రొవిజనింగ్ తదితర అంశాలపై ఆదేశాలను ఉల్లంఘించినందుకు విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ. 55 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది.