మీపై ఈఎంఐ భారమెంత?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేండ్ల తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఈ కీలక వడ్డీరేటును 5.25 శాతం నుంచి 5.50 శాతానికి పెంచగా.. దానికి అనుగుణంగా బ్యాంకులూ తమ గృహ, వాహన, వ్యక్తిగత ఇతరత్రా రుణాలపై వడ్డీరేట్లను సవరించేస్తున్నది చూస్తూనే ఉన్నాం.
- పావు శాతం పెరిగిన రెపోరేటు
- వివిధ బ్యాంకుల హోమ్ లోన్ కిస్తీలు అప్
- వాహన, వ్యక్తిగత రుణాలూ ప్రియం
న్యూఢిల్లీ/ముంబై/హైదరాబాద్, అక్టోబర్ 9: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేండ్ల తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఈ కీలక వడ్డీరేటును 5.25 శాతం నుంచి 5.50 శాతానికి పెంచగా.. దానికి అనుగుణంగా బ్యాంకులూ తమ గృహ, వాహన, వ్యక్తిగత ఇతరత్రా రుణాలపై వడ్డీరేట్లను సవరించేస్తున్నది చూస్తూనే ఉన్నాం. దీంతో రుణగ్రహీతలపై ఆ మేరకు భారం పడుతున్నది. అసలు ఈ పావు శాతం వడ్డింపుతో దీర్ఘకాలిక రుణాలైన హోమ్ లోన్ ఈఎంఐలు ఎంత పెరుగుతున్నాయి? అన్నది ఒక్కసారి పరిశీలిస్తే..
ఇదీ సంగతి..
వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసేదే ఈ రెపోరేటు. దీంతో రెపోరేటు పెరిగితే బ్యాంక్ రుణాల ఖర్చూ పెరిగిపోతుంది. అందుకే రెపోరేటు పెరిగినప్పుడు బ్యాంకులు తామిచ్చే రుణాలపైనా వడ్డీరేట్లను పెంచేస్తాయి. అయితే ప్రస్తుతం ఆయా రుణాలపై వడ్డీరేట్లను ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లేదా రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్/ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటు), ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు, ఎంసీఎల్ఆర్ ఆధారంగా నిర్ణయిస్తున్నారు. మీ రుణం ఈబీఎల్ఆర్ ఆధారంగా ఉన్నైట్టెతే రెపోరేటు సవరింపుల ప్రభావం త్వరగా పడుతుంది. అదే ఎంసీఎల్ఆర్ ఆధారంగా ఉన్నైట్టెతే సదరు సవరణలు జరిగినప్పుడే ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు ఆధారంగా లోన్ తీసుకున్నైట్టెతే రుణ కాలపరిమితి మొత్తంగా ఒకే వడ్డీరేటు ఉంటుంది. కాబట్టి రెపోరేటు పెంపు/తగ్గింపు ప్రభావాలేవీ ఇక్కడ ఉండవు. కానీ ఇప్పుడు ఈబీఎల్ఆర్, ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలే ఎక్కువ. ఇక వడ్డీరేట్ల పెంపు ప్రభావం ఈఎంఐలలోగానీ, రుణ కాలపరిమితిపైగానీ లేదా రెండింటిపైనా ఉండవచ్చు.
ఏప్రిల్‌కల్లా 6.25 శాతానికి
పశ్చిమాసియా సంక్షోభంతో విజృంభిస్తున్న ముడి చమురు ధరలు, దానికితోడు ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు.. ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్న నేపథ్యంలో తటస్థ వైఖరి నుంచి క్రమబద్ధమైన కఠిన ద్రవ్య విధానం వైపునకు ఆర్బీఐ మళ్లింది. ఈ క్రమంలోనే సమీప భవిష్యత్తులో వడ్డీరేట్ల కోతలకు అవకాశం లేదన్న సంకేతాలనిచ్చిన ఆర్బీఐ.. ద్రవ్యోల్బణం పెరిగినా, రూపాయి మారకం విలువ బాగా పడిపోయినా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇంకా ఎగబాకినా రెపోరేటును పెంచుతూపోతామని స్పష్టం చేసింది. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్ నాటికి రెపోరేటు 6.25 శాతానికి చేరవచ్చన్న అంచనాను ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ అధ్యక్షుడు ధవల్ దలాల్ వెలిబుచ్చారు. ఇదే జరిగితే గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణగ్రహీతలపై మరింత భారం తప్పదంటున్నారు.
మిగులు నగదు నిల్వలున్న ప్రస్తుత రుణగ్రహీతలు.. తీసుకున్న రుణంలో కొంత భాగం చెల్లిస్తే ఈఎంఐల పెంపు ప్రభావం నుంచి, ఓవరాల్‌గా వడ్డీ భారం నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ముందుగా మీ రుణం ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ రేటులో దేని ఆధారంగా తీసుకున్నదో పరిశీలించండి.
-అభిషేక్ కుమార్, సహజ్‌మనీ.కామ్ వ్యవస్థాపకుడు
గృహ రుణాల వంటి దీర్ఘకాల రుణాల్లో వడ్డీరేట్లు పెరుగడం, తగ్గడం అన్నది సహజమే. కాబట్టి ఇండ్ల కొనుగోలుకు అవకాశం ఉన్నవారు ఆగనవసరం లేదు. రుణ కాలపరిమితి తగ్గించుకుంటే వడ్డీ భారం కూడా తగ్గుతుంది. కానీ ఈఎంఐ పెరుగుతుంది. వాహన కొనుగోలుదారులు డౌన్‌పేమెంట్ ఎక్కువగా చెల్లించడం వల్ల పెరిగిన వడ్డీరేట్ల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.
-దీపేశ్ రాఘవ్, సెబీ నమోదిత పెట్టుబడి సలహాదారు
వడ్డీరేట్ల పెంపుతో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై సమీప భవిష్యత్తులో కొంత ప్రతికూల ప్రభావం కనిపించవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాల ఫండ్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ధరల పతనానికి దారితీయగలదు. ప్రస్తుత హోల్డింగ్స్‌లో మదుపర్లకు రాబడులు తగ్గుతాయి.
-దేవాంగ్ షా, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

