Offline Digital Payments | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో యాప్‌ల ద్వారా పేమెంట్స్ చేస్తున్నాం. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్స్ విధానానికి ఆర్బీఐ సోమవారం పరిమితులు ఖరారు చేసింది. ఒక్కో ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్స్ గరిష్టంగా రూ.200 వరకు మాత్రమే చేయొచ్చు. అదీ కూడా ముఖాముఖీ ఉంటేనే అనుమతి ఇస్తుంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో చిన్నమొత్తాల చెల్లింపులకు ఫ్రేమ్ వర్క్‌ను ఆర్బీఐ ప్రకటించింది. 2020 సెప్టెంబర్ నుంచి 2021 జూలై వరకు ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసింది.
ఈ విధానం కింద ధృవీకృత పేమెంట్ సిస్టం ఆపరేటర్స్ (పీఎస్‌వోస్) వద్ద ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో గరిష్ఠంగా రూ.2000 వరకు ఆఫ్‌లైన్ పేమెంట్స్ చేయొచ్చు. కానీ దానికి ఆన్లైన్ మోడ్‌లో అడిషనల్ ఫ్యాక్టర్ అథంటికేషన్ పొందాల్సి ఉంటుందని తెలిపింది. 2019లోనే 41 శాతం భారత జనాభాకు ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యం లభించిందని ప్రపంచబ్యాంక్ పేర్కొంది.