ముంబై, మే 28: రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయాలు తీసుకున్నది. గవర్నమెంట్ సెక్యూరిటీ(జీ-సెక్) మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు వీలుగా ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత లేదా సంస్థలు పలు రెగ్యులేటరీ అనుమతుల కోసం ‘ప్రవాహ్’ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్‌తో రెగ్యులేటరీ అనుమతులతోపాటు రిజర్వుబ్యాంక్‌కు సంబంధించిన అన్ని క్లియరెన్స్‌లు త్వరితగతంగా జరగనున్నాయి. ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును.