BharatPe-Centrum | భారత్‌పే-సెంట్రం స్మాల్ ఫైనాన్స్బ్యాంక్కు లైసెన్స్
BharatPe-Centrum | స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏర్పాటు చేయడానికి భారత్‌పే, సెంట్రం ఫైనాన్సియల్ సర్వీసెస్‌లకు ఆర్బీఐ లైసెన్స్ జారీ చేసింది.

BharatPe-Centrum | భారత్ పే, సెంట్రం గ్రూప్ అనుబంధ సెంట్రం ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) ఏర్పాటు చేసేందుకు ఆర్బీఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇందులో రెండు సంస్థలకు సమాన వాటాలు ఉంటాయి. అందుకు ఆర్బీఐ గైడ్‌లైన్స్, టైమ్‌లైన్స్ జారీ చేసింది.
దీనిపై సెంట్రం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్పాల్ బింద్రా స్పందిస్తూ.. ఆరేండ్ల విరామం తర్వాత తమకు నూతన బ్యాంక్ లైసెన్స్ మంజూరైనందుకు ఆనందంగా ఉందన్నారు. తమ పట్ల విశ్వాసం చూపినందుకు ఆర్బీఐకి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. భారత్ పే భాగస్వామ్యం.. శక్తిమంతమైన టీమ్‌తో నూతన బ్యాంక్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
భారత్ పే కో ఫౌండర్ కం సీఈవో అశ్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ..ఉన్నత స్థాయి టెక్నాలజీ సాయంతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా అణగారిన వర్గాలకు రుణ పరపతి, పెట్టుబడి, పేమెంట్ సేవలందించేందుకు అవకాశం కలిగిందన్నారు. ఇందుకు తాము ఆనందిస్తున్నామని పేర్కొన్నారు. సెంట్రం భాగస్వామ్యంతో ప్రపంచ ప్రమాణాలతో కూడిన సంస్థను సృష్టిస్తామని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

