Shaktikanta Das | ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వరుసగా రెండోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. యూఎస్‌కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచారు. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్ ప్రకారం.. ఈ ఏడాది శక్తికాంత దాస్‌కు ఏ ప్లస్ రేటింగ్ లభించిందని ఆర్బీఐ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఏ ప్లస్ రేటింగ్‌ను ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ఇవ్వగా.. అందులో దాస్ అగ్రస్థానం పొందారని పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వడ్డీరేట్ల నిర్వహణ ఆధారంగా సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లకు ఏ నుంచి ఎఫ్ వరకు గ్రేడ్లను కేటాయించగా.. అద్భుతమైన పనితీరుకు ఏ, అధ్వాన్న పనితీరు కనబరిచిన వారికి ఎఫ్ రేటింగ్ ఇచ్చారు.
శక్తికాంత దాస్‌తో పాటు డెన్కార్కు చెందిన క్రిస్టియన్ కెటెల్ థామ్సన్, స్విట్జర్లాండ్ గవర్నర్ థామస్ జే జోర్డాన్ ఏ ప్లస్ రేటింగ్‌ను సాధించిన వారిలో ఉన్నారు. గ్లోబల్ ఫైనాన్స్ వార్షిక సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్ బ్యాంకర్లను గౌరవిస్తుంది. వ్యూహాలు వాస్తవికత, సృజనాత్మకత, పట్టుదల ఆధారంగా రేటింగ్స్ ఇస్తుంది. ఆయా గవర్నర్ల ద్వారా సమిష్టి కృషితో ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ద్రవ్యోల్బణ రేటును గణనీయంగా తగ్గించడంలో సహాయపడిందని పేర్కొంది. గ్లోబల్ ఫైనాన్స్ 1994 నుంచి ఏటా సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్ ప్రచురిస్తుంది. యూరోపియన్ యూనియన్, ఈస్టర్న్ కరేబియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్‌తో సహా దాదాపు 100 దేశాలు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లను గ్రేడ్ చేస్తుంది.