ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ, నవంబర్ 12: అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 7 శాతం లోపే నమోదుకావచ్చన్న ఆశాభావాన్ని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తి కాంత దాస్ వ్యక్తం చేశారు. గత 6-7 నెలలుగా ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యలతో అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం దిగివస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టులో 7 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్‌లో 7.4 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ గణాంకాలు ఈ నెల 14న వెలువడనున్నాయి. శనివారం దాస్ ఒక సదస్సులో మాట్లాడుతూ.. ‘ఆందోళనకర స్థాయిలో ఉన్న అధిక ద్రవ్యోల్బణంతో మేము సమర్థవంతంగా పోరాడుతున్నాం. సోమవారం వెల్లడికానున్న అక్టోబర్ సంఖ్య 7 శాతంకంటే తక్కువ ఉంటుందని భావిస్తున్నాం’ అని చెప్పారు. ఈ రేటు 6 శాతాన్ని మించి ఉంటే వృద్ధిని దెబ్బతీస్తుందని, అందుచేత ఆర్బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన 2-6 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…