ముంబై, డిసెంబర్ 10: ఆర్బీఐ 2017-18లోని 11వ సిరీస్, 2019-20లోని 1వ సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) రిడెంప్షన్ ధరలను బుధవారం ప్రకటించింది. ఈ రెండు సిరీస్‌లకూ యూనిట్‌కు రూ.12,801 గానే నిర్ణయిస్తూ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
11వ సిరీస్ బాండ్లు 2017 డిసెంబర్ 11న జారీ అవగా, దానికి తుది రిడెంప్షన్ ధరను ఇచ్చింది. ఇక 1వ సిరీస్ ఎస్‌జీబీల కోసం మాత్రం ముందస్తు రిడెంప్షన్ ధరను పేర్కొన్నది. దీనికి గడువు గురువారమే ఉన్నది.