ముంబై, జూన్ 3 : ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన రత్నాకర్ పట్నాయక్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
1990లో ఎల్ఐసీ డైరెక్ట్ రిక్య్రూట్ ఆఫీసర్గా తన కేరియర్ను ప్రారంభించిన పట్నాయక్..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ చేశారు. గతంలో ఎల్ఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ అధికారిగా విధులు నిర్వహించారు.