Ratan Tata | ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముంబయిలోని ఓ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇంతకు ముందు సైతం ఆరోగ్యంపై వార్తలు రాగా.. అధికారిక ట్విట్టర్ వేదికగా తెలిపుతూ.. వార్తలను ఖండించారు. ఐసీయూలో అడ్మిట్ అయ్యారన్న వార్తలను కొట్టిపడేశారు. ‘ఇటీవల నా ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలు వట్టి పుకార్లేనన్నారు.
ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. వయసు సంబంధిత కారణాలతో రొటీన్ ఆరోగ్య సపరీక్షలు చేయించుకున్నానన్నారు. ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన పరిస్థితి విషమంగా ఉందని మరోసారి జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. టాటా సన్స్ మాజీ చైర్మన్. టాటా గ్రూప్ చైర్మన్‌గా ఉన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం రెండు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్ (2008), పద్మ భూషణ్ (2000) అవార్డులతో సత్కరించింది.
ఆయన ప్రతిష్టాత్మకమైన కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, బిషప్ కాటన్ స్కూల్ (సిమ్లా), కార్నెల్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ పూర్వ విద్యార్థి. రతన్ టాటా మార్చి 1991లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 28 డిసెంబర్ 2013లో పదవీ విరమణ చేశారు. ఆయన పదవీకాలంలో టాటాగ్రూప్ ఆదాయం అనేక రెట్లు పెంచారు. 1991లో కేవలం రూ.10వేలకోట్ల టర్నోవర్ నుంచి 2011-12 వరకు 100.09 బిలియన్ డాలర్లకు చేరింది. 2000 సంవత్సరంలో టాటీ టీ నుంచి 450 మిలియన్లకు టెట్లీ, 2007లో 6.2 బిలియన్స్‌కు టాటా స్టీల్ నుంచి ఉక్కు తయారీదారు కోరస్, 2008లో టాటా మోటార్స్ నుంచి ల్యాండ్‌మార్క్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను 2.3 బిలియన్లకు కొనుగోలు చేశారు. పదవీ విరమణ అనంతరం వారసుడి విషయంలో సైరస్ మిస్త్రీతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయనను 2016 అక్టోబర్ 24న మిస్త్రీని తొలగించిన అనంతరం.. గ్రూప్ తాత్కాలిక చైర్మన్‌గా పని చేశారు. జనవరి 2017లో టాటా గ్రూప్ పగ్గాలను ఎన్ చంద్రశేఖర్‌కు అప్పగించారు.