Abhishek Bachchan- Ramraj | రామ్రాజ్ కాటన్ ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఎంపికయ్యారు. తమ బ్రాండ్ అంబాసిడార్‌గా అభిషేక్ బచ్చన్ నియామకం పట్ల రామ్రాజ్ కాటన్ యాజమాన్యం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. కంపెనీ విస్తరణ, దుస్తుల విభాగంలో తమ ఉనికి బలోపేతానికి ఆయన నియామకం ఉపకరిస్తుందని పేర్కొంది.
‘మా కుటుంబంలోకి అభిషేక్ బచ్చన్‌ను స్వాగతించడం ఆనందదాయకం. దేశవ్యాప్తంగా ప్రజలందరితో ఆయనకు గల అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని అభిషేక్ బచ్ఛన్ను ప్రచారకర్తగా ఎంపిక చేశాం. ఈ నియామకంతో మా వ్యాపారం మరింత మందికి చేరువ కావాలని కోరుకుంటున్నాం’ అని రామ్రాజ్ కాటన్ ఫౌండర్ కం చైర్మన్ కేఆర్ నాగరాజన్ తెలిపారు. రామ్‌రాజ్‌తో భాగస్వామ్యం పట్ల ఆనందం వ్యక్తం చేసిన అభిషేక్ బచ్చన్.. ఆ సంస్థతో కలిసి పని చేయడానికి ఆసక్తితో ఉన్నానని పేర్కొన్నారు.