రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన టౌన్‌షిప్‌లలో అసంపూర్తిగా ఉన్న బహుళ అంతస్థుల భవనాల (3 టవర్లు) విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.70.11 కోట్ల ఆదాయం వచ్చింది. నగర శివార్లలోని పోచారం టౌన్షిప్లో రెండు టవర్లను, గాజుల రామారంలో ఒక టవర్‌ను బుధవారం లాటరీ ద్వారా అమ్మేశారు. కాగా, చదరపు అడుగుకు పోచారంలో రూ.1,650, గాజుల రామారంలో రూ.1,995గా ధరల్ని నిర్ణయించారు.
ఇందులో భాగంగా పోచారంలో 72 ఫ్లాట్లతో ఉన్న ఓ టవర్‌ను ఎన్టీపీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు రూ.13.78 కోట్లకు, 122 ఫ్లాట్లున్న మరో టవర్‌ను గాయత్రీ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ట్రస్టుకు రూ.30 కోట్లకు అమ్మేశారు. అలాగే గాజుల రామారంలోని 112 ఫ్లాట్లున్న టవర్‌ను ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు రూ.26.33 కోట్లకు విక్రయించారు.