విస్తరణ బాటలో రఘువంశీ.. రూ 400 కోట్లు సమీకరించిన హైదరాబాదీ కంపెనీ
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ సంస్థ రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ (ఆర్వీఏజీ) తన విస్తరణ ప్రణాళికలకు ఊతమిస్తూ 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) సమీకరించింది.
హైదరాబాద్ జూలై 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ సంస్థ రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ (ఆర్వీఏజీ) తన విస్తరణ ప్రణాళికలకు ఊతమిస్తూ 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) సమీకరించింది. దీనికి నార్వెస్ట్, స్కేగెన్ అసెట్ మేనేజ్మెంట్ నేతృత్వం వహించగా.. ఇండస్ బ్రిడ్జి వెంచర్స్, జీజేఎన్ఎక్స్ వెంచర్స్, ప్రముఖ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా పెట్టుబడులు పెట్టారు. ఈ నిధులను భారత్, యూకే, అమెరికాలోని తయారీ కేంద్రాల విస్తరణకు వినియోగించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ వెల్లడించారు.
అలాగే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని హార్డ్‌వేర్ పార్లో నిర్మిస్తున్న సమగ్ర తయారీ క్యాంపస్, మిషన్ సిస్టమ్స్, డీప్-టెక్ అండ్ అటానమస్ సిస్టమ్స్ వ్యాపారాల అభివృద్ధికి ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయని చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూప్.. ప్రస్తుతం 3 దేశాల్లో 10కిపైగా తయారీ యూనిట్లు, 1,200 మందికిపైగా ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తోంది.
ప్రస్తుతం ఈ సంస్థ వద్ద రూ.2,500 కోట్లకు పైగా ఆర్డర్ బుక్ ఉన్నది. హార్డ్‌వేర్ పార్ ప్రాజెక్టును వేగవంతం చేసి, స్వదేశీ మిషన్ సిస్టమ్స్, అటానమస్ సిస్టమ్స్ అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తామని ఎండీ వంశీ వికాస్ తెలిపారు. సంస్థ సీఈవో శివ అరవింద్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఏఆర్‌సీఐ, డీఆర్డీఓ, ఏడీఏ వంటి ప్రముఖ విద్యా, పరిశోధనా, రక్షణ సంస్థలతో భాగస్వామ్యాలు కొనసాగిస్తూ స్వదేశీ ఏరోస్పేస్ సాంకేతికతల అభివృద్ధికి కృషి చేస్తోందని వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

