లెఫ్టార్మ్ స్పిన్‌పై గిల్ ఫోకస్.. నెట్స్‌లో జోరుగా పాక్టీస్
శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ ఆడటంలో తనబలహీనతను అధిగమించేందుకు శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌లో సుదీర్ఘ సమయం గడిపాడు.
కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ ఆడటంలో తనబలహీనతను అధిగమించేందుకు శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌లో సుదీర్ఘ సమయం గడిపాడు. గాలెలో జరిగిన తొలి టెస్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఔటయ్యాడు. దాంతో కొలంబోలో ఆదివారం మొదలయ్యే రెండో టెస్టులో ప్రభాత్‌కు కౌంటర్ ఇచ్చేందుకు తన బలహీనతలను సరిదిద్దుకుంటున్నాడు. టెస్ట్ క్రికెట్లో లెఫ్టార్మ్ స్పిన్ ఆడటంలో గిల్ కొంత ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 42 టెస్టుల్లో లెఫ్టార్మ్ స్పిన్నర్లు అతడిని 11 సార్లు ఔట్ చేశారు.
ఈ క్రమంలో లైన్‌ను అంచనా వేయడంలో దొర్లుతున్న పొరపాట్లను సరిదిద్దుకునేందుకు నెట్స్‌లో మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌ను గిల్ సుదీర్ఘంగా ఎదుర్కొని సాధన చేశాడు. స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే కెప్టెన్ కొన్ని సూచనలు ఇస్తూ కనిపించాడు.
మరోవైపు ఓపెనర్, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మైదానంలోకి వచ్చినప్పటికీ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండగా..యువ ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ నెట్స్‌లో రిషబ్ పంత్, గిల్‌కు బంతులు విసిరాడు.తొలి టెస్టులో కీలక హాఫ్ సెంచరీ సాధించిన మిడిలార్డర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కొంత ఆలస్యంగా నెట్ సెషన్లో చేరి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

