న్యూఢిల్లీ, జూలై 14 : బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఆర్ దొరైస్వామిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ సమావేశమై ఈ నియామకానికి ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక సేవల విభాగం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఆయ న ఈ పదవిలో మూడేండ్లపాటు లేదా ఆగస్టు 28, 2028 వరకు కొనసాగనున్నారు. గత నెలలో పదవీ విరమణ చేసిన సిద్ధార్థ మోహంతీ స్థానంలో కేంద్రం..శాట్ పాల్ భానోను తాత్కాలిక బాస్‌గా నియమించింది.