హైదరాబాద్, మార్చి 13: ప్రముఖ ఎలక్ట్రికి వాహన స్టార్టప్ సంస్థ క్వాంటమ్ ఎనర్జీ.. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రెండు స్కూటర్ల ధరలను తగ్గించింది. ప్లాస్మా ఎక్స్, ఎక్స్ఆర్ మాడళ్ల ధరలను 10 శాతం కోత పెట్టినట్టు వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ప్లాస్మా ఎక్స్ మాడల్ ధర రూ.1,19,525 నుంచి రూ.1,09, 000కి దిగిరాగా, అలాగే ఎక్స్ఆర్ మాడల్ రూ.99,757 నుంచి రూ.89 వేలకు తగ్గాయని కంపెనీ ఎండీ చక్రవర్తి తెలిపారు. ఈ తగ్గింపు ఆఫర్ ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు. కేవలం 7.5 సెకండ్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ప్లాస్మా ఎక్స్ గంటకు 65 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. సింగిల్ చార్జింగ్‌తో 110 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.