హైదరాబాద్, డిసెంబర్ 16 : క్వాంటమ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ..హైదరాబాద్లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో సీమంత్ శుక్లా మాట్లాడుతూ..దక్షిణాదిలో ఉనికిని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ నూతన ఆఫీస్ ప్రారంభించినట్టు చెప్పారు.
రాష్ట్రంలో ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం వల్లనే ఇక్కడి వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.