న్యూఢిల్లీ, జూన్ 19: వచ్చేనెల 1 నుంచి పాదరక్షలకు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి కానున్నాయి. చైనా తదితర దేశాల నుంచి భారత్లోకి దిగుమతి అవుతున్న నాసిరకం, తక్కువ నాణ్యత కలిగిన పాదరక్షలకు చెక్ పెట్టేందుకే ఈ కఠిన ప్రమాణాలను తీసుకువస్తున్నట్టు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ ఇక్కడ మీడియాకు తెలిపారు.