న్యూఢిల్లీ, నవంబర్ 4: ప్రభుత్వరంగ సంస్థలైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ)లు రుణ గ్రహీతలకు షాకిచ్చాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వీటి లో పీఎన్బీ తన ఎంసీఎల్ఆర్ని 30 బేసిస్ పాయింట్లు పెంచగా, బీవోఐ మాత్రం ఎంసీఎల్ఆర్ని 15 బేసిస్ పాయింట్లు సవరించింది. ఈ తాజా నిర్ణయంతో రుణ గ్రహీతల వడ్డీ చెల్లింపులు మరింత అధికమవనున్నాయి.