హైదరాబాద్, మార్చి 21: ప్రముఖ బీ2సీ, బీ2బీ సేవల సంస్థ ప్రోజో.. హైదరాబాద్‌లో మరో గిడ్డంగిని ప్రారంభించింది. హైదరాబాద్‌కు సమీపంలోని మేడ్చల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌తో మొత్తం తొమ్మిదికి చేరుకున్నాయి. దీంతో దక్షిణాదిలో సంస్థ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల సంఖ్య 26కి చేరుకోగా, వీటిని 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పింది.
బీ2సీ, బీ2బీ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సరికొత్త సెంటర్‌ను నెలకొల్పినట్టు, అలాగే దక్షిణాదిలో మరింత బలోపేతం కావడానికి ఈ సెంటర్లు దోహదం చేయనున్నాయని కంపెనీ ఫౌండర్, సీఈవో అశ్విని జాఖర్ తెలిపారు.