Jandhan | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో హామినిచ్చారు. దీంతో కోట్లాది మంది సామాన్యులు పీఎం జన్‌ధన్ స్కీమ్ కింద బ్యాంకుల్లో ఖాతాలను తెరిచారు. తొమ్మిదేండ్లు గడిచాయి.
ప్రధాని తీసుకొస్తానన్న నల్లధనం వెనక్కి రాలేదు. ఖాతాల్లో ఒక్క పైసా జమకాలేదు. దీంతో చాలామంది తమ జన్ ధన్ ఖాతాలను వాడటమే మానేశారు. ఇదే విషయమై పార్లమెంట్లో ఓ సభ్యుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. 10.36 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క లావాదేవీ కూడా జరుగలేదని పేర్కొంది.