Gold Price | న్యూఢిల్లీ, అక్టోబర్ 21: బంగారం ధరలు రాకెట్‌వేగంతో దూసుకుపోతున్నాయి. దేశీయంగా పండుగ సీజన్ కావడంతో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొన్నది. ఫలితంగా గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న పుత్తడి సోమవారం ఏకంగా 80 వేల మైలురాయిని అధిగమించి రికార్డు సృష్టించింది. దేశ చరిత్రలో ఇంతటి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర ఒకేరోజు రూ.750 అధికమై రూ.80,650 పలికింది. మధ్యప్రాచ్యం దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతోపాటు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వడ్డీరేట్లను తగ్గించడంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రతరమైంది. దీంతో తమ పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల నుంచి అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు రికార్డు స్థాయిలో ఎగిశాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
ఆకాశానికి వెండి రేటు
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి సోమవారం మరో ఉన్నత శిఖరాలపైన ముగిసింది. నాణేల తయారీదారులతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.5,000 అధికమై చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకింది. ఒకేరోజు ఇంతటి స్థాయిలో పెరగడం కూడా ఇదేతొలిసారి కావడం విశేషం. గత శుక్రవారం రూ.94,500గా ఉన్న కిలో ధర సోమవారానికి రూ.99,500కి చేరుకున్నది. త్వరలో లక్ష రూపాయలకు చేరుకునే అవకాశాలున్నాయని ట్రేడర్లు వెల్లడిస్తున్నారు.
తగ్గనున్న కొనుగోళ్లు
రికార్డు స్థాయికి చేరుకోవడంతో పసిడి, వెండి అమ్మకాలు పడిపోయే ప్రమాదం ఉన్నదని ట్రేడర్లు హెచ్చరిస్తున్నారు. సామాన్యుడికి ఇప్పటికే దూరమైన బంగారం, భవిష్యత్తులో ఇదే ట్రెండ్‌లో దూసుకుపోతే మాత్రం లగ్జరీ వాళ్లు కూడా వెనుకంజవేసే అవకాశం ఉన్నదన్నారు. పసిడి వినిమయంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ ప్రతియేటా 800-900 టన్నుల మేర పుత్తడిని దిగుమతి చేసుకుంటున్నది. ఈసారి బడ్జెట్లో పుత్తడిపై సుంకాన్ని తగ్గిస్తూ నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో బంగారం ధరలు 7 శాతం వరకు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కె ట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,735.30 డాలర్లు పలకగా, వెండి 34 డాలర్ల వ ద్ద ట్రేడవుతున్నది.
ధరలు పెరగడానికి కారణాలు
బంగారం ధరలు (రూపాయల్లో)