LPG Cylinder Price Hike | చమురు కంపెనీలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.16.50 పెరిగింది. పెరిగిన ధరలు ఆదివారం నుంచి అమలులోకి వచ్చాయి. పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1818.50కి పెరిగింది. ధరలు పెరుగడం వరుసగా ఇది ఐదోసారి. అలాగే, ఐదు కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ ధరపై రూ.4 వరకు పెంచింది. ఇక గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. గత నెలల ప్రారంభంలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ లిండర్ ధరను రూ.62 పెంచగా.. అక్టోబర్ 1న రూ.48.5 పెరిగి రూ.1,740కి చేరింది. ఆగస్ట్ 1న సిలిండర్‌పై రూ.6.5 పెరిగింది. సెప్టెంబర్ 1న రూ.39 పెరిగింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అందరూ ఇబ్బందులుకు గురవుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్లో సిలిండర్ల ధరల పెంపుదలతో ఎల్పీజీపై ఆధారపడే వాణిజ్య సంస్థలు, చిరువ్యాపారులపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉన్నది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరిగినప్పటికీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పులు చేయకపోవడం స్వల్పంగా ఊరటనిచ్చినట్లయ్యింది. అంతర్జాతీయ చమురు ధరల ట్రెండ్‌కు అనుగుణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరను ఆదివారం 1.45 శాతం పెంచారు. దేశ రాజధానిలో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధర కిలోలీటర్‌కు రూ.1,318.12 పెరిగి రూ.91,856.84కి చేరింది. తాజాగా పెరిగిన ధరలతో కోల్‌కతాలో రూ.1927, ముంబయిలో రూ.1771, చెన్నైలో రూ.1980, హైదరాబాద్‌లో రూ.2066 పలుకుతున్నది. ఇక డొమెస్టిక్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.803 ఉండగా.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.603కే అందుబాటులో ఉంది. ముంబయిలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, హైదరాబాద్‌లో రూ.855 వద్ద కొనసాగుతున్నది.