హైదరాబాద్, జనవరి 21: ప్రతిష్ఠాత్మక ఐజే అవార్డుల్లో ఉత్తమ బ్రేస్లెట్ డిజైన్ విభాగంలో జిఆర్టి జ్యుయెల్లర్స్ విజేతగా నిలిచింది. ఈసారి 12వ ఎడిషన్‌కు దేశవ్యాప్తంగా 21 నగరాల నుంచి వెయ్యికిపైగా డిజైన్లు రాగా.. జిఆర్టి జ్యుయెల్లర్స్ చెన్నై తయారుచేసిన బ్రేస్‌లెట్‌ను విజయం వరించింది.
ఈ సందర్భంగా సంస్థ ఎండీ ఆనంద్ అనంతపద్మనాభన్ మాట్లాడుతూ.. జిఆర్టి మొదలైన దగ్గర్నుంచి మార్కెట్లో ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నదన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బెస్ట్ బ్రేస్లెట్ డిజైన్‌గా ఐజే అవార్డును సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో సంస్థకు చెందిన ప్రతీ కార్మికుడి కృషి ఉన్నదని శనివారం ఓ ప్రకటనలో అభినందించారు.