హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తేతెలంగాణ): ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుతో రాష్ట్ర ప్రతిష్ఠ మరింత పెరగనున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో డిపాజిటరీ ట్రస్ట్ క్లియరింగ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ఎమర్జింగ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలనుకొనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, రాబోయే రోజుల్లో ఏఐ అంటే తెలంగాణ, హైదరాబాద్ గుర్తుకువచ్చేలా యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.