RC Bhargava | వచ్చే ఏడాది నుంచి బుల్లి కార్లకు గిరాకీ.. ఇవీ కారణాలన్న మారుతి సుజుకి ఆర్సీ భార్గవ
RC Bhargava | బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి రావడంతో 2019-20లో టూ వీలర్స్ గిరాకీ తగ్గినా తర్వాత పుంజుకున్నది. అలాగే వచ్చే ఏడాది కల్లా బుల్లి కార్లకు గిరాకీ పెరుగుతుందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అంచనా వేశారు.
RC Bhargava | గతంలో ఫస్ట్ టైం కారు కొనే వారు బుల్లి కార్లకు ప్రాధాన్యమిచ్చే వారు. కానీ బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి రావడంతో బుల్లి కార్ల తయారీ ఖర్చు పెరిగిపోయింది. దీంతో 2022-23లో బుల్లి కార్ల విక్రయాలు 2018-19 సంవత్సరంలో అమ్ముడైన కార్ల కంటే రెండు లక్షలు తగ్గిపోయాయని మారుతి సుజుకి చైర్మన్ ఆర్ సీ భార్గవ చెప్పారు. 2019-20లో బీఎస్-6 ప్రమాణాలు, కొవిడ్ మహమ్మారి, సెమీ కండక్టర్స్ కొరత వల్ల కార్ల విక్రయాలు తగ్గిపోయాయని తెలిపారు. తిరిగి 2022-23లో బుల్లి కార్లు మినహా మిగతా మోడల్ కార్ల సేల్స్ సాధారణ స్థాయికి చేరాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.13 మిలియన్ల కార్లు అమ్ముడవుతాయని ఆర్సీ భార్గవ అంచనా వేశారు. అయినా 2018-19తో పోలిస్తే నాలుగు శాతం తక్కువే అమ్ముడు పోయాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతం గ్రోత్ రికార్డవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
కార్ల విడి భాగాలు, సెమీ కండక్టర్ల లభ్యత మెరుగు పడటంతోపాటు కస్టమర్ల నుంచి గిరాకీ పెరగడంతో కార్ల తయారీ సంస్థల మధ్య పోటీ పెరిగింది. దీంతో కార్ల తయారీ సంస్థలు ఈవీ కార్లతోపాటు ఆకర్షణీయ ఫీచర్లతో పలుమోడల్ కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయని ఆర్సీ భార్గవ అన్నారు. కానీ, బుల్లి కార్లకు డిమాండ్ పడిపోవడం ఆటోమొబైల్ పరిశ్రమ బలహీనతలను బయట పెడుతుందన్నారు. ధరలు పెరుగుతుండటంతో మున్ముందు బుల్లి కార్లకు స్వల్పంగా డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత ద్విచక్ర వాహనాలకు గిరాకీ తగ్గినా తర్వాత డిమాండ్ పుంజుకున్నది.అలాగే బుల్లి కార్లకూ గిరాకీ పెరుగుతుందన్నారు. 2024-25లో స్వల్పంగా గిరాకీ పెరిగినా, వచ్చే ఏడాదిలోనే డిమాండ్ ఎక్కువ అవుతుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

