Imran Khan | పాకిస్తాన్ (pakistan)మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను( 73) ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుండి తిరిగి అడియాలా జైలుకు (jail) తరలించినట్లు ఆయన పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్’ (PTI) ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆయనకు(Imran khan) ప్రత్యేక వైద్య సేవలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో వైద్య పరీక్షల కోసం అర్ధరాత్రి వేళ ఆయనను షిఫా ఇంటర్నేషనల్ తరలించారు.
అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఆయనను కస్టడీలో ఉంచడం సురక్షితమని వైద్యులు నిర్ధారించడంతో ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరిగి జైలుకు తీసుకువచ్చి, ఆయన సెల్‌కు తరలించారని పాకిస్థాన్ మీడియా నివేదించింది. కాగా, ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి జైలులో ఉన్నారు. తనపై నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమని ఆయన అంటున్నారు. అయితే, ప్రభుత్వం ఈ ఆరోపణను ఖండిస్తోంది.