న్యూఢిల్లీ, ఆగస్టు 24: సూరత్ వస్త్ర పరిశ్రమ.. ఉత్పత్తికి స్వచ్ఛంధ విరామం ఇస్తున్నది. పాలిస్టర్ దారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొన్ని యూనిట్లు వారానికి 2 రోజుల సెలవును పాటిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం సంబంధిత అవాంతరాలు.. వస్త్ర తయారీని లాభదాయకంగా చేయడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కిలో దారం రూ.112 నుంచి 140కి ఎగిసిందని అంటున్నారు. దీంతో మీటర్ బట్ట తయారీ ఖర్చు రూ.5దాకా పెరిగిందని, మార్కెట్లో ఇంత రేటుకు అమ్ముడుపోవడం లేదని వివరిస్తున్నారు.
కాగా, దాదాపు 1.5 లక్షల పవర్‌లూమ్స్ ఇప్పుడు ఉత్పత్తిని తగ్గించేశాయి. ఈ క్రమంలోనే కొన్ని వారానికి 5 రోజులే పనిచేస్తుండగా, మరికొన్ని షిఫ్ట్‌లను కుదించేసినట్టు గుజరాత్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమా ఖ్య మాజీ ఉపాధ్యక్షుడు విష్ణుభాయ్ పటేల్ తెలిపారు. దేశంలోని ప్రధాన టెక్స్టైల్ హబ్‌లలో సూరత్ ఒకటి. ఇక్కడ సుమారు 7-8 లక్షల వస్త్ర తయారీ పరిశ్రమలున్నాయి. సాధారణంగా 24 గంటలూ ఇక్కడ పని నడుస్తూనే ఉంటుంది. అయితే ఉత్పత్తి తగ్గడం తో 50 వేల మంది వర్కర్లు ప్రభావితం కానున్నారు.