Discounts on Poco Smart Phones | ఈ ‘పొకో` స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్.. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ షురూ..!
Discounts on Poco Smart Phones | ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో భాగంగా పలు పొకో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గించారు. గరిష్టంగా రూ.4000 వరకు డిస్కౌంట్ లభిస్తున్నది.
Discounts on Poco Smart Phones | ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. భారత్‌లో తన కస్టమర్లు, మెంబర్ల కోసం మరో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 10 (శనివారం) నుంచి ఈ నెల 14 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లలో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘పోకో’.. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నది.
ప్రత్యేకించి పొకో ఎఫ్5, పొకో ఎక్స్5 ప్రో 5జీ, పొకో ఎక్స్5 5జీ, పొకో ఎం5, పొకో సీ55, పొకో సీ51, పొకో సీ50 తదితర ఫోన్లపై భారీగా ధరలు తగ్గించింది. ఈకామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా వివిధ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఇన్ స్టంట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
ఈ బిగ్ బిలియన్ సేల్స్‌లో పొకో ఎఫ్5 ఫోన్.. బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.26,999లకే లభ్యం అవుతుంది. లాంచింగ్ ధరతో పోలిస్తే రూ.3000 తక్కువ. అలాగే పొకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ రూ.22,999 కాగా, రూ.21,999లకే సొంతం చేసుకోవచ్చు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.
పొకో ఎక్స్5 5జీ ఫోన్ రూ.18,999 కాగా, రూ15,999లకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ రూ.1000 అదనంగా లభిస్తుంది. పొకో ఎం5 ఫోన్ రూ.12,499 నుంచి రూ.8,999లకు తగ్గించేసింది. అదనంగా రూ.500 బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.
పొకో సీ55 ఫోన్ ధర రూ.9,499 కాగా, రూ.1750 డిస్కౌంట్ తో రూ.7,749లకే లభిస్తుంది. ఇక ఎంట్రీ లెవల్ ఫోన్లు పొకో సీ51 ఫోన్ రూ.8,499 నుంచి రూ.6,999, పొకో సీ50 ఫోన్ రూ.6499 నుంచి రూ.5649లకే సొంతం చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

