PNB Special FD | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సీనియర్ సిటిజన్లు (80 ఏండ్లు దాటిన వారికి) ఫిక్స్డ్ డిపాజిట్లపై 80 బేసిక్ పాయింట్లు (0.80 శాతం) వడ్డీ అదనంగా ఆఫర్ చేస్తున్నది. సాధారణ పౌరుల కంటే సూపర్ సీనియర్ సిటిజన్ల (80 ఏండ్లు దాటిన వారు) ఫిక్స్డ్ డిపాజిట్లకు 0.80 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది. ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల టెన్యూర్ వరకు ఈ అదనపు వడ్డీరేట్లు లభిస్తాయి. 60 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం (50 బేసిక్ పాయింట్లు) వడ్డీ ఆఫర్ చేస్తున్నది పంజాబ్ నేషనల్ బ్యాంక్. పెరిగిన వడ్డీరేట్లు గత నెల 13 నుంచి అమల్లో ఉన్నాయి.
ఇతర బ్యాంకులతో పోలిస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 80 బేసిక్ పాయింట్ల వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఒకవేళ మెచ్యూరిటీ డేట్‌కు ముందే ముందస్తుగా విత్‌డ్రా చేసుకుంటే మాత్రం 30 బేసిక్ పాయింట్ల వడ్డీ వర్తించదు.
ఎస్బీఐ తన ఖాతాదారులకు `వుయ్ కేర్ సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్`, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆధ్వర్యంలో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అనే పేరుతో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు అమలు చేస్తున్నాయి. సూపర్ సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ వుయ్ కేర్ ఎఫ్డీ కింద 80 బేసిక్ పాయింట్లు అదనపు వడ్డీ ఇస్తుండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
గడువు ———————— సాధారణ ——————— సీనియర్ ——————- సూపర్ సీనియర్
పౌరులకు వడ్డీ (%) ——— సిటిజన్లకు వడ్డీ (%) —— సిటిజన్లకు వడ్డీ (%)
7- 14 రోజులు —————– 3.00 —————————– 3.50 ————————- 3.80
15- 29 రోజులు —————- 3.00 —————————– 3.50 ————————- 3.80
30- 45 రోజులు —————- 3.00 —————————- 3.50 ————————- 3.80
46- 90 రోజులు ————— 3.25 —————————– 3.75 ————————– 4.05
91- 179 రోజులు ————– 4.00 —————————– 4.50 ————————– 4.80
180- 270 రోజులు ————- 4.50 —————————- 5.00 ————————– 5.30
271- ఏడాదిలోపు ————- 4.50 —————————- 5.00 ————————– 5.30
ఏడాది గడువు —————- 5.50 —————————- 6.00 ————————– 6.30
ఏడాది- 404 రోజులు ——— 5.50 —————————- 6.00 ————————– 6.30
405 రోజులు —————— 6.10 —————————- 6.60 ————————— 6.90
406 రోజులు – రెండేండ్లు —- 5.50 —————————- 6.00 ————————– 6.30
రెండేండ్లు-మూడేండ్లు —— 5.60 —————————- 6.10 ————————– 6.40
3 ఏండ్లు- ఐదేండ్లు ———– 5.75 —————————- 6.25 ————————– 6.55
5-10 ఏండ్లు ——————- 5.65 —————————- 6.15 ————————- 6.45