శనివారం 05 డిసెంబర్ 2020
Business - Oct 09, 2020 , 01:15:49

యశోదాలో పీఎన్‌బీ ఆరోగ్య బీమా డెస్క్‌

యశోదాలో పీఎన్‌బీ ఆరోగ్య బీమా డెస్క్‌

హైదరాబాద్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌, సోమాజీగూడ యశోదా ఆస్పత్రులలో తమ ఆరోగ్య బీమా కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఈ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రోడక్ట్స్‌ డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు గురువారం ఓ ప్రకటనలో బ్యాంక్‌ తెలియజేసింది. కుటుంబ, వ్యక్తిగత, ఆరోగ్య, వయసురిత్యా అవసరాలను దృష్టిలో పెట్టుకుని 5 ప్రముఖ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేట్ల నుంచి విస్తృత శ్రేణి బీమాలను అందిస్తున్నామని ఈ సందర్భంగా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌, తెలంగాణ, ఏపీ, కర్నాటక జోనల్‌ అధిపతి అశుతోష్‌ చౌధరి తెలియజేశారు. గత ఆరు నెలలుగా కరోనా ఇన్సూరెన్స్‌ కవరేజీకి విశేష ఆదరణ లభిస్తున్నదన్న ఆయన బీమా ప్రాసెసింగ్‌, చెల్లింపులు వేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్‌ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సికింద్రాబాద్‌ యశోదా హాస్పిటల్స్‌ యూనిట్‌ అధిపతి డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ స్వాగతించారు.