Retire Early | రిటైర్మెంట్ అంటే విశ్రాంతి కోసమేనా? మీ కలలు సాకారం చేసుకునేది ఇంకెప్పుడు!!
Retire Early | ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్- రిటైర్ ఎర్లీ.. ఈ మాటకు సంక్షిప్త రూపం ఫైర్. ఆర్థిక స్వేచ్ఛ సాధించాలనుకోవడం స్వాగతించాల్సిన విషయమే. జీతం మీద ఆధారపడాల్సిన పన్లేకుండా.. నెలనెలా మన బ్యాంకు ఖాతాలో డబ్బు వచ్చి పడేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవడం గొప్ప నిర్ణయమే. కానీ, సమస్యంతా ‘రిటైర్ ఎర్లీ’తోనే! ఉద్యోగ విరమణ.. చురుకైన జీవితం నుంచి శాశ్వత విరమణ కాకూడదు.
Retire Early | ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్- రిటైర్ ఎర్లీ.. ఈ మాటకు సంక్షిప్త రూపం ఫైర్. ఆర్థిక స్వేచ్ఛ సాధించాలనుకోవడం స్వాగతించాల్సిన విషయమే. జీతం మీద ఆధారపడాల్సిన పన్లేకుండా.. నెలనెలా మన బ్యాంకు ఖాతాలో డబ్బు వచ్చి పడేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవడం గొప్ప నిర్ణయమే. కానీ, సమస్యంతా ‘రిటైర్ ఎర్లీ’తోనే! ఉద్యోగ విరమణ.. చురుకైన జీవితం నుంచి శాశ్వత విరమణ కాకూడదు.
పాతికేళ్లలోపే కొలువులో చేరతారు. తొలి ఉద్యోగం.. తొలి జీతం నుంచే రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటారు. ఇంక్రిమెంట్లు.. ప్రమోషన్లు వచ్చిన కొద్దీ ఉద్యోగ విరమణ నిధికి కేటాయింపులు పెంచుకుంటారు. నలభై అయిదేళ్లు నిండగానే.. కెరీర్‌కు మంగళం పాడేసి.. ప్రపంచాన్ని చుట్టొస్తూనో, పడక్కుర్చీలో కునుకుతీస్తూనో బతికేయాలని కొందరి ఆలోచన. ఇక్కడే సమస్య! వైద్య సదుపాయాలు పెరిగాయి. జీవన నాణ్యత పెరిగింది. దీంతోపాటు జీవన ప్రమాణాలూ పెరిగిపోతున్నాయి. వీటన్నిటివల్లా నలభై అయిదేళ్ల వయసు ‘మలి యవ్వనం’ కిందికే వస్తున్నది. అరవై అచ్చమైన ‘నడి వయసు’. డబ్భు దాటితేకానీ ‘వృద్ధాప్యం’ మన శరీరంలో ప్రవేశించదు.. పడక కుర్చీ అవసరమూ రాదు. ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’.. అన్నట్టు రాని వృద్ధాప్యాన్ని కొనితెచ్చుకోవడం ఎందుకు? ఏ రోజుకు ఆరోజు, ఏ వారానికి ఆ వారం, ఏ నెలకు ఆ నెల.. ఏదో ఓ లక్ష్యం సవాలు విసురుతున్నప్పుడే మెదడు చురుగ్గా ఉంటుంది. ఆలోచనలు ఉత్తేజాన్ని పొందుతాయి. ఆ సవాళ్లకు తగినట్టుగా శరీరమూ సర్వసన్నద్ధం అవుతుంది. మళ్లీ పడుకోడానికే నిద్రలేస్తూ, అరిగించుకోడానికి ఆహారం తింటూ, గడియారం వైపు చూస్తూ కాలాన్ని కరిగించుకుంటూ.. బతికే బతుకూ ఓ బతుకేనా? ఆ శ్రమలేని జీవితంతో శరీరం సర్వీసింగ్‌కు వచ్చేస్తుంది. రక్తపోటు ఎక్కువ అవుతుంది. మధుమేహం చుట్టుముట్టేస్తుంది. పొట్ట ముందుకొస్తుంది. హఠాత్తుగా ఏ అర్ధరాత్రో ‘ఛాతీలో నొప్పి’ అంటూ దవాఖానలో చేరిపోతారు. బైపాస్ అంటారు. స్టెంట్లు పడతాయి. రిటైర్మెంట్ ప్రకటించుకున్న ఆరు నెలలలోపే తీవ్ర అనారోగ్యాలపాలు అవుతున్నవారు ఎంతోమంది. ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అనే మాట ఎలా ఉన్నా.. ఖాళీ మనిషి మాత్రం అనారోగ్యాల పుట్టే! కాబట్టి, మీకు మీరు రిటైర్మెంట్ ఇచ్చుకోవద్దు. అవసరమైతే చట్టబద్ధమైన రిటైర్మెంట్ తర్వాత కూడా మీ అనుభవాన్ని, నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోండి. సమాజం కోసమూ కొంత కేటాయించండి. ఆత్మసంతృప్తిని మించిన ఆనందం ఉండదు. దీనివల్ల శరీరంలో పాజిటివ్ హార్మోన్ల ఊట పెరుగుతుంది.
అలా అయితే ఓకే..
రిలాక్సేషన్కో, రిటైర్మెంట్కో కాకుండా.. అటకెక్కిన ఆశల్ని బతికించుకోడానికి, అర్ధంతరంగా ఆగిపోయిన కలల్ని నిజం చేసుకోడానికి.. ఫైర్ ఓ మంచి అవకాశం. ఆర్థిక సమస్యల కారణంగా, బాధ్యతల బరువు వల్ల పేరు పక్కన ఎంబీయే అనే మూడక్షరాల్ని చూడలేకపోయిన వెలితిని ఇప్పుడు పూడ్చుకోవచ్చు. పాతికేళ్ల వయసులో పెట్టుబడికి పైసల్లేక వ్యాపార ఆలోచనలకు నీళ్లు వదులుకుని ఉంటే.. స్టార్టప్ ఆలోచనకు ‘స్టాండ్ అప్’ చెప్పవచ్చు. అంకుర సంస్థకు ప్రాణం పోయవచ్చు. నటన, రచన, సంగీతం.. ఇలా నచ్చిన అభిరుచికి ఓటేయవచ్చు. సౌందర్య వ్యాపార దిగ్గజం నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ యాభై ఏళ్ల వయసులో ఆంత్రప్రెన్యూర్‌షిప్ వైపు అడుగేశారు. కాకపోతే, ఓ వయసు తర్వాత ఓ కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నపుడు.. ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మలిసంధ్యలో రిస్క్ తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. మళ్లీ సున్నా నుంచి జీవితాన్ని ఆరంభించడం దాదాపుగా అసాధ్యం. కాబట్టి ‘ప్లే సేఫ్’ ఫార్ములా అనుసరించాలి. రిటైర్మెంట్ నిధి జోలికి వెళ్లకుండా.. ఇతరత్రా సేవింగ్స్నే పెట్టుబడిగా పెట్టాలి. ఆ స్థాయిలో నిధులు సమకూరిన తర్వాతే.. ఫైర్ దిశగా అడుగులేయాలి. అప్పటికే తమకు అనుభవం ఉన్న రంగాన్ని ఎంచుకోవడం కొంత సురక్షితం. లాభాల వెంట పడకుండా ఆనందాన్ని ఆస్వాదించడానికే పనిచేయాలి. కొన్ని కలలు దూరపుకొండలు. దిగాకే లోతు తెలుస్తుంది. అధిరోహించడం ఆరంభించాకే పరిమితులు అర్థం అవుతాయి. ఆ పరిస్థితే వస్తే అక్కడితో పరుగు ఆపడం మేలు. దారి మార్చుకోవడం ఉత్తమం. ఫైర్.. మనకు దారిచూపే కాగడా కావాలే కానీ, మన బతుకులో నిప్పులు పోయకూడదు. సుదూర భవిష్యత్తులో మనం కోరుకున్న జీవితాన్ని గడపడం కోసం.. వర్తమానాన్ని వృథా చేసుకోకూడదు. సంపాదనలో సింహభాగం.. ఎర్లీ రిటైర్మెంట్ పెట్టుబడులకు కేటాయించి.. మొక్కుబడిగా బతికేయకూడదు. నేడు నిజం. రేపు అనూహ్యం. ఈ క్షణం అనుభవించాల్సిన ఆనందాల్ని అనుభవించాల్సిందే. ఇల్లు, కారు, పిల్లల చదువులు, టూర్లు.. ఏ విషయంలోనూ రాజీ వద్దు.
యాభై తర్వాత, అరవై తర్వాత, డెబ్బై తర్వాత.. ఎప్పుడైనా కావచ్చు. రిటైర్మెంట్ జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకోండి. ఆర్థిక ప్రణాళిక పక్కాగా ఉండాలి. జీవితాన్ని సెలెబ్రేట్ చేసుకోండి. రేపటి కోసం ఈరోజును పణంగా పెట్టొద్దు. ఫైర్‌కు ముందైనా, తర్వాత అయినా.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబానికి సమయం కేటాయించండి. మరొకరితో పోల్చుకుని కుమిలిపోవద్దు. ‘విశ్రాంతి’ ఒక మానసిక భావన. ఏ పనీ చేయకపోవడమే విశ్రాంతి అనుకుంటే పొరపాటు. చురుకైన జీవితం నుంచి విరమిస్తున్నాం అనడానికి అదో సంకేతం.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
Personal Finance Tips | కట్టిన ఇల్లు కొంటే లాభమా? కడుతున్నప్పుడే ఇంటిని బుక్ చేసుకుంటే బెటరా?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

