Piyush Goyal | భారత్ ఎవరికీ తలవంచదు.. సుంకాల ఉద్రిక్తతలపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యలు..!
Piyush Goyal | అగ్రరాజ్యం అమెరికా 50శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భారత్ వైఖరిని స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ ఎవరికీ తలవంచదన్నారు. ప్రపంచంలో భారత్ భవిష్యత్తుపై ఆయనను ప్రశ్నించిన సమయంలో ఆయన స్పందిస్తా చాలాబలంగా, నమ్మకంగా ఉందన్నారు.
Piyush Goyal | అగ్రరాజ్యం అమెరికా 50శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భారత్ వైఖరిని స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ ఎవరికీ తలవంచదన్నారు. ప్రపంచంలో భారత్ భవిష్యత్తుపై ఆయనను ప్రశ్నించిన సమయంలో ఆయన స్పందిస్తా చాలాబలంగా, నమ్మకంగా ఉందన్నారు. ఇది ఏటా 6.5శాతం వృద్ధి చెందుతోందని.. ఇది వేగవంతం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచం “డీగ్లోబలైజేషన్”ను ఎదుర్కొంటున్నదనే భావనను ఆయన తోసిపుచ్చారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు తమకోసం వాణిజ్య మార్గాలను, భాగస్వాములను పునర్నిర్వచించుకుంటున్నాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం భారతదేశం ఎక్కువగా ఎగుమతులు చేస్తుందనే నమ్మకం ఉందన్నారు.
వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై, భారతదేశం విధానం కేవలం సుంకాల రాయితీలను కోరడం కంటే ఎక్కువగా ఉందని గోయల్ తెలిపారు. నాలుగు దేశాల EFTA గ్రూపుతో చర్చలను గుర్తు చేశారు. భారత్‌ది నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, మనకు యువ శక్తి ఉందని ఉందని తెలిపారు. EFTA సభ్య దేశాలు భారతదేశంలో 100 బిలియన్లను పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాయని, దాంతో మిలియన్ ప్రత్యక్ష ఉద్యోగాలు, మొత్తం మీద 5 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. EFTA ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని.. దాని ప్రయోజనాలు కనిపిస్తాయన్నారు. కాంగ్రెస్ ఎంపీ భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందని వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ వారసుడిని ఎప్పటికీ దేశం మరిచిపోదన్నన్నారు. ప్రతికూల కథనాలను పునరావృతం సిగ్గుచేటన్నారు. ప్రపంచం ఎదుట భారత్ స్థానంపై అవమానకరమైన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీని దేశం ఎప్పటికీ క్షమించదన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ దేశ కరెన్సీ, విదేశీ మారక నిల్వలు, స్టాక్ మార్కెట్, ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని.. ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ద్రవ్యోల్బణం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని గోయల్ అన్నారు. ప్రపంచ వృద్ధికి 16 శాతం తోడ్పడుతూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం మొత్తం మనల్ని గుర్తిస్తుందనిని గోయల్ తెలిపారు.
భారతదేశంలోని 1.4 బిలియన్ల యువ నైపుణ్యం కలిగిన, ప్రతిష్టాత్మకమైన పౌరులు ప్రపంచ భాగస్వాములకు శక్తివంతమైన ఆకర్షణగా పేర్కొన్నారు. 2000 సంవత్సరం నుంచి భారతదేశంలో జరిగిన మార్పులను కూడా ఆయన ప్రస్తావించారు. వేలాది ఉద్యోగాలను సృష్టించడంలో విజయవంతమైన ఐటీ పరిశ్రమను ప్రశంసించారు. COVID-19 సంక్షోభాన్ని దేశం ఎలా అవకాశంగా మార్చుకుందో కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సవాలుతో కూడిన సమయాల్లో భారతదేశం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ యూఏఈ, మారిషస్, ఆస్ట్రేలియా, EFTA బ్లాక్, యూకే, ఈయూ, చిలీ, పెరూ, న్యూజిలాండ్, యూఎస్, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చురుకుగా కొనసాగిస్తోందని, ఖరారు చేస్తోందని గోయల్ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ వంటి బలమైన నాయకుడి నేతృత్వంలో భారతదేశం నేడు బలంగా, గౌరవంగా ఉందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- America
- India
- piyush goyal
- Tariffs
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

