గరిష్ఠ ధర రూ.36.80 లక్షలు
న్యూఢిల్లీ, మార్చి 31: ప్రముఖ వాహన సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటర్..దేశీయ మార్కెట్లోకి ఐకానిక్ ఎస్యూవీ మోడల్ హిలక్స్ను పరిచయం చేసింది. ఈ వాహనం రూ.33.99 లక్షల నుంచి రూ.36.80 లక్షల ధరల మధ్యలో లభించనున్నది. ఇంజినీరింగ్, భద్రత, కంఫర్ట్, థ్రిల్ కోరుకుంటున్నవారికి ఈ వాహనం సరైనదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్తో తయారైన ఈ వాహనం మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో లభించనున్నది.