‘కల్కి 2’లో దీపిక లేదు.. మరి సుమతి?
‘కల్కి 2898ఏడీ’ చిత్రం నుంచి దీపిక పదుకోన్ని తప్పిస్తున్నట్టు ఏడాది క్రితం చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ‘కల్కి 2’లో ఆ స్థానాన్ని రీప్లేస్ చేసే నటి ఎవరు? అనే ప్రశ్న అటు మీడియానూ, ఇటు ప్రేక్షకులనూ ఏడాదిగా వెంటాడుతూనే ఉన్నది. సాయిపల్లవి, అలియాభట్, శ్రీనిధి శెట్టి.. ఇలా చాలామంది నటీమణుల పేర్లు వినపడుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు దర్శకుడు నాగ్అశ్విన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
‘కల్కి 2898ఏడీ’ చిత్రం నుంచి దీపిక పదుకోన్ని తప్పిస్తున్నట్టు ఏడాది క్రితం చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ‘కల్కి 2’లో ఆ స్థానాన్ని రీప్లేస్ చేసే నటి ఎవరు? అనే ప్రశ్న అటు మీడియానూ, ఇటు ప్రేక్షకులనూ ఏడాదిగా వెంటాడుతూనే ఉన్నది. సాయిపల్లవి, అలియాభట్, శ్రీనిధి శెట్టి.. ఇలా చాలామంది నటీమణుల పేర్లు వినపడుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు దర్శకుడు నాగ్అశ్విన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. “కల్కి 2898ఏడీ’లో దీపిక పదుకోన్ చేసిన సుమతి పాత్రను వేరే నటి పోషించనున్నదని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ పాత్రను ఎవరితోనూ భర్తీ చేయడం లేదు.
అంతేకాదు, కొత్తగా ఎవరూ ఈ సినిమాలో చేరడం లేదు. తొలిభాగంలో పరిచయమైన ప్రధాన పాత్రల చుట్టూనే మలిభాగం కూడా నడుస్తుంది’ అంటూ తెలిపారు డైరెక్టర్ నాగ్అశ్వన్. అయితే.. నాగీ చెప్పిన ఈ సమాధానం పలు ప్రశ్నలకు తావిస్తున్నది. ‘కల్కి 2’లో సుమతిగా దీపికానే కనిపిస్తారా? అదే జరిగితే.. ఆమె నుంచి నిర్మాతలకు సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. తొలిభాగం పూర్తయ్యేనాటికి సుమతి పాత్ర నిండు గర్భిణి. ఇంకా కల్కి జన్మించలేదు. అంతేకాదు, సుమతి గర్భాన్ని విచ్ఛిన్నం చేయాలని తొలిభాగంలో యాస్కిన్ ప్రయత్నించాడు. ఆ పోరాటంతోనే ఫస్ట్ పార్ట్ ముగిసింది. మరి అలాంటప్పుడు సుమతి పాత్ర లేకుండా ‘కల్కి 2’ చేయడం అస్సలు కుదరదు. మరి నాగ్అశ్విన్ దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఈ చిక్కుముడి వీడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

