లక్నో: ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దాదాపు 60 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వరదలు సంభవించాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 56 మంది మృతిచెందగా, మరో 46 మంది గాయపడ్డారు.
పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా సీతాపూర్‌లో అత్యధికంగా ఏడుగురు మృతి చెందారు. లక్నోలో శనివారం ఉదయం వరకు 21 గంటల్లో 125.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయోధ్యలో భారీ వర్షాలు కురుస్తుండటంతో, భక్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.