మోర్తాడ్, సెప్టెంబర్ 27: తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ పెద్దదిక్కుగా నిలిచారని, ఆయన చేసిన సేవలు, త్యాగాలను ఘనంగా స్మరించుకోకపోతే తెలంగాణ సమాజం తనను తాను అవమానించుకున్నట్టేనని మాజీ మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో లక్ష్మణ్‌బాపూజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, నివాళులర్పించారు.
రాష్ట్రసాధన కోసం ఎవ రూ ముందుకు రాని రోజుల్లోనే మంత్రి పదవికి రాజీనామా చేసిన అసలైన ధీరశాలి బా పూజీ అని వేముల కొనియాడారు. హైదరాబాద్‌లో ఉద్యమకారులు సమావేశమవడానికి ఎవరూ నిలువనీడ ఇవ్వనప్పుడు బాపూ జీ తన సొంత నివాసమైన జలదృశ్యాన్ని తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీకి అ ప్పగించి ఉద్యమానికి కొండంత అండగా నిలిచారని ప్రశంసించారు. బాపూజీ ఆశీస్సులు, ప్రోత్సహంతోనే నాటి ఉద్యమసారథి కేసీఆర్ నేతృత్వంలో ప్రజలు కదలివచ్చి స్వరాష్ర్టాన్ని సాధించుకున్న విషయాన్ని కేసీఆర్ పలుమార్లు గుర్తుచేసుకున్నారని తెలిపారు.